హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్

NRML: లక్ష్మణ్‌చందా మండలం కనకాపూర్‌లో చోరీకి గురైన టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితులు కొండపల్లి సాయిలు,షేక్‌ రంజన్‌లను అరెస్ట్ చేశారు. జల్సాల కోసం బైక్‌ దొంగిలించిన సాయిలు, రంజన్‌కు రూ.5 వేలకే విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక నిఘా కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు.