హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కన్నపుదొరవలసలో ఏనుగుల బీభత్సం

PPM: జియ్యమ్మవలస మండలంలోని కన్నపుదొరవలస గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. గ్రామ పరిసరాల్లోకి వచ్చిన ఏనుగులు సుమారు 4 ఎకరాల్లో సాగు చేసిన వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలను తొక్కి ధ్వంసం చేశాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసి ప్రభుత్వం పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.