హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రేపు అల్లూరు శివాలయంలో సామూహిక కుంకుమార్చన

NLR: అల్లూరు పట్టణంలోని శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం మంగళ గౌరీ వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు ఘనంగా జరుగుతాయన్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు శ్రీ కామాక్షి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుందన్నారు.