హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆస్పత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి పట్టణంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన పనులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఆసుపత్రి నిర్మాణాన్ని ఎలాంటి జాప్యం లేకుండా నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.