MBNR: జడ్చర్ల మండలం ముదిరెడ్డిపల్లి క్రాసింగ్ వద్ద పేపర్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది డానియల్, కుతుబుద్దీన్ ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను లారీ నుంచి బయటకు తీశారు. అనంతరం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణ
లారీ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు


