హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాస్త్రోక్తంగా ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన

VSP: చినవాల్తేర్‌లోని శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానంలో సోమవారం ధ్వజస్తంభాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఆలయ అర్చకులు ఏవీఎల్‌ఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివాసాలు, శేషహోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కుమారుడు వెలగపూడి ప్రతాపరుద్ర ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభ ప్రతిష్ఠలో పాల్గొన్నారు.