ASR: ఏజెన్సీ గిరిజన నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఈ నెలాఖరులో భారీ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు అరకులోయ ఎస్సై టీ.మల్లేశ్వరరావు తెలిపారు. ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో మేళా జరుగుతుందని పేర్కొన్నారు. 35 ఏళ్లలోపు అర్హత కలిగిన యువతీ యువకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పాడేరులో భారీ జాబ్‌మేళా: ఎస్సై


