హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ రైల్వే స్టేషన్‌లో సౌకర్యాల తనిఖీ

VSP: దక్షిణ తీర రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్, డీఆర్ఎం లలిత్ బోహ్రాతో కలిసి సోమవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల సౌకర్యాలను తనిఖీ చేశారు. ఏఐ ఆధారిత ప్రయాణీకుల విచారణ వ్యవస్థ 'సారిక ఏఐ'ని పరిశీలించిన జీఎం, వాయిస్ ఆధారిత ఈ వ్యవస్థను మెరుగుపరచేందుకు పలు సూచనలు చేశారు. దీన్ని రెండో దశలో రైల్‌వన్ యాప్‌తో అనుసంధానించనున్నారు.