హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్టాండ్ వద్ద ట్రాఫిక్ తనిఖీలు

PLD: నరసరావుపేట పల్నాడు బస్టాండ్ పరిసరాల్లో ద్విచక్ర వాహనాలపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు ఆదేశాల మేరకు సీఐ లోకనాధం ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో హెల్మెట్ ధరించకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, మైనర్లు ద్విచక్ర వాహనాలు నడపడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి చర్యలు చేపట్టారు.