హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోలీస్ ప్రజావాణికి 31 ఫిర్యాదులు'

NZB: పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య 31 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా విని, చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత ఎస్ఐలు, సీఐలకు సూచించారు. ఫిర్యాదుల పరిష్కార స్థితిపై అధికారులతో ఫోన్లో మాట్లాడి తగిన ఆదేశాలు జారీ చేశారు.