హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దళితుల స్థలాలు పరిశీలించి చర్యలు చేపట్టండి'

PLD: శావల్యాపురం (M) పిచ్చికలపాలెంలో దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి జేసీకి వినతిపత్రం అందజేశారు. 73 మంది దళితులకు కేటాయించిన స్థలాలకు వెంటనే పొజిషన్‌ చూపించాలని కోరారు. స్పందించిన జేసీ అధికారులను పిలిచి స్థలాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.