NLR: తూర్పు పూండ్ల గ్రామ పరిధిలోని గమళ్లపాలెంలో తన ఇంటికి వెళ్లే దారిని ఓ వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని పర్చూరు శ్రీదేవి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశారు. అధికారులు స్థలం, దారిని పరిశీలించి వాస్తవాలను నిర్ధారించి, ఆక్రమణ తొలగించి న్యాయం చేయాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటి దారి ఆక్రమణపై మహిళ ఫిర్యాదు


