TPT: గూడూరు మండలం పాలిచర్ల గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు చేపట్టారు. సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
భీమలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు


