కోనసీమ: అల్లవరం మండలం ఓడలరేవు నుంచి వేటకు వెళ్లి గల్లంతైన 8 మంది మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సోమవారం ఆదేశించారు. ఆగస్టు 3న సముద్రంలోకి వెళ్లిన IND-AP-E8-MO-135 బోటు ఈ నెల 13న తిరిగి రావాల్సి ఉండగా ఇప్పటివరకు ఓడలరేవు చేరుకోలేదని తెలిపారు. గాలింపు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యకారుల గాలింపునకు కలెక్టర్ ఆదేశం


