హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు

SDPT: బెజ్జంకి ఆదర్శ పాఠశాలలో గంటల ప్రాతిపదికన PGT ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉపాధ్యాయుల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఖలీదా శిరీన్ తెలిపారు. PG, B.Ed., TET అర్హత ఉన్న వారు ఈ నెల 19న సాయంత్రం 4 గంటల్లోపు ధ్రువపత్రాల ప్రతులతో పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. డెమో బోధన ద్వారా ఎంపిక జరుగుతుందని తెలిపారు.