హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యలమందలో లక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్‌ ప్రారంభం

PLD: నరసరావుపేట (M) యలమందలో టీడీపీ నేత కడియాల రమేష్‌కు చెందిన నూతన లక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్‌ను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల స్థానికులు, వాహనదారులకు ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.