MLG: ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 28 దరఖాస్తులు స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్ జి తెలిపారు. భూ సమస్యలు 3, ఇందిరమ్మ ఇళ్లు 5, పెన్షన్లు 7, ఇతర శాఖలకు 13 దరఖాస్తులు అందాయని చెప్పారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి నిర్ణీత గడువులో సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత


