హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

224 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ శ్యాంప్రసాద్

SS: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. పుట్టపర్తి రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల వినతులను స్వీకరించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 224 అర్జీలు రాగా సంబంధిత అధికారులకు పంపారు.