SKLM: ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీసు శాఖ ప్రాధాన్యత ఇస్తోందని ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి 62 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్జీ పై చట్టపరంగా విచారణ జరిపి, త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్పీ గ్రీవెన్స్‌కు 62 ఫిర్యాదులు


