హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విష్ణువర్ధన్ రెడ్డికి జాతీయ స్థాయిలో పదవి

SS: కదిరి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి జాతీయ స్థాయిలో అత్యున్నత గుర్తింపు లభించింది. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్‌గా ఆయనను అధిష్ఠానం నియమించింది. పార్టీ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ ముఖ్యమైన బాధ్యతలను అప్పగించినట్లు నాయకులు తెలిపారు. ఈ నియామకం పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.