KMM: వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా సొంతంగా యాంటీబయాటిక్స్ వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ డి. రామారావు హెచ్చరించారు. సాధారణ జలుబు, ఫ్లూ వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లకు ఇవి పనిచేయవని స్పష్టం చేశారు. కేవలం డాక్టర్లు సూచించిన మోతాదులోనే వీటిని వాడాలని కోరారు. వైద్యులు కూడా వీటిపై రోగులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
తెలంగాణ
డాక్టర్ల సలహాతో యాంటీబయాటిక్స్ వాడాలి: DMHO


