హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దోపిడీలు చేస్తున్న ముగ్గురు యువకుల అరెస్ట్

ATP: చెడు వ్యసనాలకు అలవాటుపడి వాహనాలు, నగదు దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను ఆత్మకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పి.కొత్తపల్లి రహదారి వద్ద అదుపులోకి తీసుకుని వారి నుంచి కారు, బొలెరో, రూ.10,000 నగదు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పి.సిద్ధాపురం, పొట్టమర్రి గ్రామాలకు చెందిన ప్రకాష్, రామ చరణ్, మహేష్ కుమార్‌గా గుర్తించారు.