హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెన్షన్లను అందించాలని ఎంపీడీవోకు వినతి

HNK: నడికూడ ఎంపీడీవో రామకృష్ణను తెలంగాణ రక్షణ సేన నాయకులు కలిసి నేడు వినతి పత్రం అందజేశారు. చేయూత పెన్షన్ పథకంలో వృద్ధాప్య పెన్షన్లను చేర్చాలని, మండలంలో అర్హులైన వృద్ధులకు వెంటనే పెన్షన్లను అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎంపీడీవోను నేతలు కోరారు. కార్యక్రమంలో నేతలు దండు సుధాకర్, జలగూరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.