హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులపై హైకోర్టు లాయర్ ఆరోపణలు

BPT: అద్దంకి (మం) శంకవరప్పాడు వద్ద ఆటోను ఢీకొన్న పోలీస్ కారులో గంజాయి తరలింపు, ఇద్దరు ఎస్సైలు మద్యం సేవించినట్లు ఆరోపణలు వచ్చాయని హైకోర్టు లాయర్ నక్కా రజిని అన్నారు. ఈ ఘటనపై ఇద్దరు ఎస్సైలపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గంజాయి రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.