హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

109 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

కర్నూలులో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 109 ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, ఉద్యోగాల పేరుతో మోసం, పరిహారం, ఎరువులు, సబ్సిడీ విత్తనాలపై ఫిర్యాదులు అందాయి. ప్రతి ఫిర్యాదుపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.