హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారానికి 'జనతా వారధి'

ATP: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ ఆధ్వర్యంలో 'జనతా వారధి' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్‌లో డీఆర్వో మల్లోబులును కలసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని జనతా వారధి జిల్లా కన్వీనర్ ఎల్. నాగేంద్ర కుమార్ కోరారు.