హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాము కాటుకు గురై చిన్నారి మృతి

SKLM: మందస మండలం చీపి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. యాజక నవీన్, నేలవేణి దంపతుల కుమార్తె తేజస్విని(8) ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా విషసర్పం కాటేసింది. కుటుంబ సభ్యులు తొలుత నాటు వైద్యం చేయించగా, పరిస్థితి విషమించడంతో సోమవారం హరిపురం సీహెచ్‌సీకి తరలించారు. అయితే, అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.