హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

552 మందికి ఉచితంగా కళ్లజోళ్లు

WG: నరసాపురం ఇంటర్నేషనల్ లేసు ట్రేడ్ సెంటర్లో 552 మంది లేసు హస్తకళాకారులు, చేనేత కార్మికులకు ఉచిత కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఇటీవల నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించిన వారికి వీటిని అందించారు. జనసేన సీనియర్ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాస్ సొంత నిధులతో కళ్లజోళ్లను సమకూర్చారు. కార్యక్రమంలో డీఎస్పీ సుధాకర్ రావు పాల్గొన్నారు