SKLM: మహిళా ఎస్సై పై అనుచిత ప్రవర్తనకు సంబంధించిన కేసులో అరెస్టయిన ఆమదాలవలస వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చింతాడ రవికుమార్‌కు బెయిల్ మంజూరైంది. ఆయనతో పాటు కేసులో అరెస్టయిన మరో 26 మందికి కూడా ఆమదాలవలస జూనియర్ సివిల్ జడ్జి రమ్య సోమవారం బెయిల్ మంజూరు చేశారు. కాగా, జూలై 30న కొత్త రోడ్డు వద్ద జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్
చింతాడ రవికి బెయిల్ మంజూరు


