హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల నిరసన

WG: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సోమవారం తణుకు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఏరియా జర్నలిస్టులు నిరసన చేపట్టారు. APUWJ ఆధ్వర్యంలో తహశీల్దార్ అశోకవర్మకు వినతిపత్రం అందజేశారు. వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలన్నారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.