హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉపాధి హామీ పనులు కొనసాగించాలి'

PPM: ఉపాధి హామీ పనులు కొనసాగించాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని, ఫేస్ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం కొమరాడ ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కూలీలకు పనులు కల్పించడంతో పాటు పనిచేసే చోట మౌలిక వసతులు, తాగునీరు, టెంట్లు కల్పించాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఎం.రమేష్, ఏపీవో బాబాజీకి వినతిపత్రం అందజేశారు.