హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఫీజు రియింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి'

విజయనగరం వైసీపీ నియోజకవర్గ విద్యార్థి విభాగాల అధ్యక్షులు ఈశ్వర్ కౌశిక్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరెట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో జేసీ సేదు మాధవన్‌ను కలిశారు. ఈ మేరకు పెండింగ్‌లో ఉన్న స్టూడెంట్స్ ఫీజు రియింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు పొన్నాడ మణికంఠ, జీ.చందు తదితరులు పాల్గొన్నారు.