హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీధి కుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు

ASR: డుంబ్రిగుడ మండలం అరమ పంచాయతీ ముసిరి గ్రామంలో వీధి కుక్కలు చేసిన దాడిలో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఒక్కసారిగా వచ్చిన వీధి కుక్కలు వారిపై దాడి చేశాయి. ఈ దాడిలో తల, ముఖం, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం అరకులోయ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.