AKP: డీఎస్సీపై చర్చకు వచ్చి ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వైసీపీకి సవాల్ విసిరారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించారని ఎంపికైన టీచర్లు స్పష్టం చేస్తుండగా, వైసీపీ లేనిపోని ఆరోపణలు చేయడం తగదని అన్నారు. కూటమి ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'డీఎస్సీపై చర్చకు రావాలి'


