GDWL: రాజోలి మండలం పెద్ద తాండ్రపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కవిత, ప్రకాష్ దంపతుల రెండో కుమార్తె శ్రావ్య ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటుకు గురైంది. వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే శ్రావ్య మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. స్థానిక పాఠశాలలో బాలిక 3వ తరగతి చదువుతోంది.
తెలంగాణ
పాము కాటుతో బాలిక మృతి


