హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా నాగపంచమి వేడుకలు

NRML: పట్టణంలో నాగ పంచమి సందర్భంగా నాగదేవత ఆలయాలు మహిళా భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుండి మహిళలు భారీ సంఖ్యలో నాగదేవత ఆలయానికి చేరుకొని పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆ పాలను తీసుకువెళ్లి తమ సోదరుల కండ్లను కడిగారు. తమ సోదరులు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండటానికి కండ్లు కడగడం ఆనవాయితీగా వస్తుందని మహిళలు తెలిపారు.