హైదరాబాద్: 28°C
తెలంగాణ

'MRPS సమావేశాన్ని విజయవంతం చేయాలి'

MHBD: సెప్టెంబర్ 9న జరగబోయే మండల స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని MRPS గూడూరు మండల ఇంఛార్జ్ కొమ్ము నాగరాజు మాదిగ పిలుపునిచ్చారు. కొల్లాపూర్, ఏపూరు గ్రామాలలో సోమవారం ఉదయం ఆయన MRPS, MSP అనుబంధ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, గ్రామస్థాయిలో MRPS బలోపేతం చేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చిస్తామన్నారు.