హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండలంలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు

జగిత్యాల: గొల్లపల్లి మండలంలో సోమవారం నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. గొల్లపల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో భక్తులు నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని పాము పుట్టల వద్ద భక్తులు పాలు పోసి పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీరాములపల్లె గ్రామంలో చెరువు కట్ట వద్ద నాగదేవతలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.