హైదరాబాద్: 28°C
తెలంగాణ

రక్షణ గోడలు లేక ప్రమాదంగా మారిన పెద్ద చెరువు వంతెన

MNCL: చెన్నూర్ మండలం పెద్దచెరువు మధ్యలో ఉన్న భారీ శివలింగం దర్శనానికి జనం పోటెత్తుతున్నారు. అయితే శివ లింగం వద్దకు చేరుకునేందుకు ఉన్నటువంటి వంతెనకు రక్షణ గోడలు లేకపోవడం ప్రాణాలకు ప్రమాదంగా మారింది. చిన్నారులు చెరువులో పడే ప్రమాదముందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రక్షణ గోడలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.