హైదరాబాద్: 28°C
తెలంగాణ

మ్యాన్‌హోల్‌తో పొంచి ఉన్న ప్రమాదం

PDPL: గణేశ్‌నగర్‌లో ప్రధాన రహదారిపై మ్యాన్‌హోల్‌ తెరిచి ఉండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. నిత్యం రాకపోకలు సాగించే ఈ మార్గంలో మూత లేకపోవడంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదం అంచున ప్రయాణిస్తున్నారు. రాత్రివేళ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. అధికారులు వెంటనే మ్యాన్‌హోల్‌కు మూత ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.