హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగూర్ ప్రాజెక్ట్ 430 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధాన జలాశయమైన సింగూర్ ప్రాజెక్టులో నీటి నిల్వ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం డ్యామ్‌లోకి సగటున 430 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, అధికారులు 380 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం ఉదయం నాటికి ప్రాజెక్టులో 4.389 టీఎంసీల (515.330 మీటర్లు) నీటి నిల్వ నమోదైనట్లు జలవనరుల అధికారులు వెల్లడించారు.