హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు'

కృష్ణా: గుడివాడ పెద్ద కాలువ సెంటర్‌లో ట్రాఫిక్ ఎస్సై నాగరాజు వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను పాటిస్తూ, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.