BHPL: ఆగస్టు 17 నుంచి ప్రతి సోమవారం అన్ని మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, వినతులపై దరఖాస్తులను మండలస్థాయిలోనే అందజేయాలని సూచించారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేసి పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదన్నారు.
తెలంగాణ
ప్రతి సోమవారం మండలాల్లో ప్రజావాణి: కలెక్టర్


