KMR: జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు స్థిరంగా ఉందని ఏఈ సుకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా ప్రస్తుతం 457.55 మీటర్లుగా ఉందన్నారు. ప్రాజెక్టు నిండేందుకు కొద్దిపాటి నీరు అవసరమన్నారు. ఇన్‌ఫ్లో పెరిగితే గేట్లు ఎత్తే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో లేదన్నారు.
తెలంగాణ
కౌలాస్ నాలా ప్రాజెక్టు నీటి వివరాలు


