హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేదలకు వరం న్యూ లోటస్ ఆస్పత్రి'

VKB: తాండూరు 8వ వార్డులో న్యూ లోటస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిన్న ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దీనిని వార్డు కౌన్సిలర్ జావీద్ ప్రారంభించారు. వైద్యం ఖరీదైన వేళ, లారీ పార్కింగ్ వద్ద ఉన్న ఈ ఆసుపత్రిలో రోజూ కేవలం రూ. 10కే ఓపీ సేవలు అందించడం అభినందనీయమన్నారు. శిబిరంలో నిపుణులైన వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.