హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ నిర్మాణ పూజలో పాల్గొన్నకేతిరెడ్డి

ATP: యల్లనూరు మండలం కొడవండ్ల పల్లె గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ పునః నిర్మాణ పూజా కార్యక్రమం సోమవారం ఉదయం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.