హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట స్థావరంపై దాడి..!

ELR: టి. నరసాపురం(m)పుత్రేపు గ్రామంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 57,140 నగదుతో పాటు పేకముక్కలను జప్తు చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జయబాబు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేకాట, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.