హైదరాబాద్: 28°C
తెలంగాణ

చికిత్స పొందుతూ మహిళ మృతి

MHBD: నర్సింహులపేట మండలంలోని మూడావత్‌ తండాకు చెందిన మూడావత్‌ బిక్కి (70) విషపురుగు కాటుతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈ నెల 11న పొలంలో పనిచేస్తుండగా విషపురుగు కాటేయడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కుమారుడు నరసింహా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.