ATP: శింగనమల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మూడు విద్యా వాలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంఈవో నరసింహరాజు తెలిపారు. హిందీ, ఆంగ్లం, సాంఘిక శాస్త్రంలో ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. బీఈడీ, టెట్ ఉత్తీర్ణులు అర్హులన్నారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యా వాలంటీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


