హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

KKD: జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గణితం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రాల్లో ఒక్కొక్క అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ధ్రువపత్రాలతో ఈ నెల 20లోపు కార్యాలయ పనివేళల్లో దరఖాస్తులు సమర్పించాలని ప్రిన్సిపల్ చెన్నారావు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు.